ఏపీ టీడీపీలో పార్టీ పరంగా మార్పులు చేయాలని భావిస్తున్న చంద్రబాబు... ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనితను నియమించిన చంద్రబాబు... ఈ నెలాఖరు నాటికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి కొత్త వారిని ఎంపిక చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పదవికి మరోసారి ఉత్తరాంధ్రకు చెందిన నేతనే ఎంపిక చేయాలని భావిస్తున్న టీడీపీ చీఫ్... అచ్చెన్నాయుడు పేరును ఇందుకు పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీపై పోరాటం చేసే విషయంలో అచ్చెన్నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో...ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు అచ్చెన్నాయుడుతో పాటు ఈ పదవి కోసం పార్టీ యువనేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పోటీ పడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. యువకులకు ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయిస్తే... రామ్మోహన్ నాయుడుకు కూడా అవకాశాలు ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలో కీలక పదవి కోసం బాబాయ్ అబ్బాయ్ మధ్య పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kinjarapu Atchannaidu, Rammohan naidu, Tdp