అయోధ్యతో అమరావతికి పోలికా ?.. మండిపడ్డ ఏపీ మంత్రి

అమరావతి (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు.

  • Share this:
    అమరావతి అంశంలో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. అయోధ్యతో అమరావతిని పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. అయోధ్యతో అమరావతికి ఎక్కడా పోలిక లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య పుణ్యభూమి అని అమరావతి పాపాలపుట్ట అని మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతి పవిత్రస్థలం కాదు, పాపాల పుట్ట అనే విషయం ప్రధాని నరేంద్రమోదీకి కూడా అర్థమైందని ఆయన తెలిపారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని వెల్లడించారు. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఎలాంటి విధానాన్ని అవలంభించారో అందరికీ తెలుసని మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం డబ్బులు లెక్కపెట్టడం మాత్రమే తెలిసిన నారాయణ చెబితే రాజధానిని ఇక్కడ పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

    Perni nani, Amaravati, ayodhya, chandrababu naidu, పేర్ని నాని, అమరావతి, అయోధ్య, చంద్రబాబునాయుడు
    వైసీపీ నేత పేర్ని నాని (File)


    ఎప్పుడూ టీవీల్లో కనిపించకపోతే చంద్రబాబుకు ఇబ్బంది అని విమర్శించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు కూడా దిగని చంద్రబాబా సవాళ్లు విసిరేదని వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: