Dubbaka ByPoll: తనిఖీలపై క్లారిటీ ఇచ్చిన సిద్దిపేట సీపీ.. వారిని అరెస్టు చేయనున్నట్లు వెల్లడి

సిద్దిపేటలో ఈ రోజు నిర్వహించిన సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18 లక్షల నగదు దొరికిందని సీపీ తెలిపారు.

news18-telugu
Updated: October 26, 2020, 11:03 PM IST
Dubbaka ByPoll: తనిఖీలపై క్లారిటీ ఇచ్చిన సిద్దిపేట సీపీ.. వారిని అరెస్టు చేయనున్నట్లు వెల్లడి
జోయల్ డేవిస్
  • Share this:
దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. అయితే ఈ సోదాలపై సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు సిద్ధిపేట లో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు బంధువు సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలు చేశామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్ రావు ఇల్లు కేంద్రంగా ఉదయం నుండి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. దీంతో సిద్ధిపేట అర్బన్ మండల మెజిస్ట్రేట్ విజయ్ సాగర్ తో కలిసి సోదాలు చేశామన్నారు. తనిఖీల్లో సురభి అంజన్ రావు ఇంటిలో రూ. 18. 67 లక్షలు దొరికాయన్నారు. అంజన్ రావును ప్రశ్నించగా తన బావ మరిది జితేందర్ రావు ఎన్నికల కోసం తన డ్రైవర్ ద్వారా డబ్బు పంపించినట్లు చెప్పారన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులు, తహసీల్దార్ వస్తుండగా రఘునందన్ రావు, అతని అనుచరులు అడ్డుకున్నారని సీపీ చెప్పారు.
వారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.

ఈ క్రమంలో సురభి అంజన్ రావు ఇంటిలో స్వాధీనం చేసుకున్న డబ్బులలో నుంచి రూ. 5. 87 లక్షలు ఎత్తుకెళ్లారన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారి పై కేసు నమోదు కేసు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. పోలీసు విధులకు, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై సైతం కేసు నమోదు చేశామన్నారు. డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. అంజన్ రావు ఇంటికి వెళ్లినప్పటి నుంచి జరిగిన సోదాలను పూర్తిగా రికార్డు చేశామన్నారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లో కూడా సోదాలు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా.. ఓటర్లను డబ్బు తో ప్రలోభాలకు గురి చేయాలని చూసినా.. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమపై వేధింపులకు దిగుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రెవెన్యూ, పోలీసు అధికారులు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు నివాసాల్లో సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అంజన్‌ రావు ఇంట్లో రూ. 18.67 లక్షలను అధికారులు గుర్తించారు.

అయితే బీజేపీ అభ్యర్థి, అతని బంధువుల నివాసల్లో పోలీసులే డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సోదాలపై సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆ పార్టీ శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, రఘునందన్ రావుకు నడుమ తీవ్ర వాద్వాదం చోటు చేసుకుంది. ఓ సమయంలో తీవ్ర తోపులాట జరగడంతో రఘునందన్‌ సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుండడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading