వైసీపీ ఎమ్మెల్యేకు షాక్... విచారణకు రావాలని ఆదేశాలు

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో శ్రీదేవి పై విచారణకు ఆదేశించారు జాయింట్ కలెక్టర్.

 • Share this:
  ఎమ్మెల్యేకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు


  గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేకు జాయింట్ కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదంటూ దాఖలైన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ .. ఎమ్మెల్యే శ్రీదేవికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ ధృవీకరణకు సంబంధించిన ఆన్ని ఆధారాలతో రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో శ్రీదేవి పై విచారణకు ఆదేశించారు. శ్రీదేవి ఎస్సీ కాదని తేలితే ఎమ్మెల్యే పదవి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

  ఏపీ రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుల ధ్రువీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్‌ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్‌ దాఖలయ్యాయి. తాను క్రిస్టియన్‌ అని... తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన వారు దృష్టిసారించారు.

  చట్ట ప్రకారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్‌ హక్కులు కోల్పోతారని ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు. తాను ఎస్సీనని ఎన్నికల కమిషన్‌కు డాక్టర్‌ శ్రీదేవి తప్పుడు ధ్రువీకరణను దాఖలు చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా రాష్ట్రపతికి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: