ఆ ఇద్దరికీ అక్కడే కౌంటర్... జగన్ నిర్ణయం ?

రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని టీడీపీతో పాటు బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన రెండూ రాజకీయంగా ఒక్కటి కావడంతో... అమరావతి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టయ్యింది.

news18-telugu
Updated: January 17, 2020, 12:56 PM IST
ఆ ఇద్దరికీ అక్కడే కౌంటర్... జగన్ నిర్ణయం ?
సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పొత్తు పొడిచింది. జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ఇరు పార్టీల నాయకులు ప్రకటించారు. తమ మధ్య బంధం పాతదే అని పవన్ కళ్యాణ్... రాబోయే ఎన్నికల్లో విజయానికి ఈ పొత్తు దోహదపడుతుందని బీజేపీ నేతలు తెలిపారు. అయితే ఈ పొత్తు గురించి తాము మాట్లాడవలసిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీలో ఈ సరికొత్త రాజకీయ పరిణామంపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చించేందుకు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.

ఈ సమావేశాల్లోనే ఈ అంశంపై సీఎం జగన్ స్పందిస్తారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని టీడీపీతో పాటు బీజేపీ, జనసేన డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన రెండూ రాజకీయంగా ఒక్కటి కావడంతో... అమరావతి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టయ్యింది. అయితే అమరావతి ఆందోళనలతో పాటు బీజేపీ, జనసేన పొత్తుపై సీఎం జగన్ మూడు రోజుల పాటు జరిగే ఏపీ ప్రత్యేక సమావేశాల్లో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూటమికి సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>