సీఎం జగన్ వార్నింగ్... అడ్రస్ మార్చనున్న వైసీపీ ఎమ్మెల్యే

తరచూ ఏదో రకంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 10, 2019, 1:28 PM IST
సీఎం జగన్ వార్నింగ్... అడ్రస్ మార్చనున్న వైసీపీ ఎమ్మెల్యే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయతీని ఆ పార్టీ నేతలు ఏదో రకంగా సెటిల్ చేశారు. ముందుగా వైసీపీ నేతలతో సమావేశమైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి... ఆ తరువాత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఓ ఉద్యోగిపై దౌర్జన్యం చేశారనే కారణంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు చేయడం... ఆ తరువాత ఈ వ్యవహారం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాని మధ్య కొత్త విభేదాలకు తెరలేపడంతో వైసీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. వైసీపీ ముఖ్యనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు వైసీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగి ఇద్దరితో చర్చలు జరిపారు. వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికారు.

అయితే తరచూ ఏదో రకంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందని ఆయన గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు నెల్లూరులో కాకుండా కొన్నాళ్ల పాటు  అమరావతిలోనే ఉండాలని, నెలలో ఎక్కువ రోజులు అమరావతిలో ఉండాలని సీఎం జగన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ap news, ap latest news, ap politics, Kotamreddy Sridhar reddy, cm jagan warning to mla kotamreddy Sridhar reddy, Nellore rural mla Kotamreddy Sridhar reddy, Kotamreddy Sridhar reddy shifts to Amaravati, kotamreddy shifts to Nellore to Amaravati, ysrcp controversy mla Kotamreddy Sridhar reddy, cm jagan serious on mla kotamreddy Sridhar reddy, Kotamreddy Sridhar reddy vs kakani govardhan reddy, Kotamreddy Sridhar reddy versus kakani govardhan reddy, ysrcp politics, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, అమరావతికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సీఎం జగన్ సీరియస్, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


నియోజకవర్గం అభివృద్ధిని తాను చూసుకుంటానని సీఎం జగన్ కోటంరెడ్డికి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఇకపై నెలకు 25 రోజులు అమరావతిలోనే ఉండాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. మొత్తానికి వివాదాలతో పార్టీని ఇబ్బందిపెడుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.


కుందనపు బొమ్మ ప్రియాంక అరుల్ మోహన్ అదిరిపోయే ఫోటోస్...
ఇవి కూడా చదవండి :విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.. ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Health Tips : బీపీ తగ్గాలా... ఈ జ్యూస్ ఓ గ్లాస్ తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...
Published by: Kishore Akkaladevi
First published: October 10, 2019, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading