• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM YS JAGAN TO VISIT DELHI AND MEET AMIT SHAH TOMORROW AK

రేపు మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్... కీలక భేటీ ?

రేపు మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్... కీలక భేటీ ?

సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

అమిత్ షాతో జగన్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో... సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం జగన్... ఆయనతో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇచ్చారు. నేడు ఢిల్లీలోనే ఉండి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు.

    అయితే రేపు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో... మరోసారి ఢిల్లీ వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు ఏపీ సీఎం జగన్. అమిత్ షాతో జగన్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు వంటి అంశాల్లో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖే కావడంతో... అమిత్ షాతో జగన్ భేటీ కీలకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    రేపు మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్... కీలక భేటీ ? | Cm ys jagan to visit delhi and meet amit shah tomorrow ak
    కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ (File)


    మండలి రద్దుకు దారి తీసిన పరిణామాలతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ సమగ్ర వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రధాని మోదీతో సమావేశం తరువాత మరోసారి సీఎం జగన్ ఢిల్లీ బాట పడుతుండటంతో... ఆయన తీసుకున్న మండలి రద్దు సహా పలు నిర్ణయాలకు కేంద్రం కూడా పచ్చజెండా ఊపుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: