సీఎం జగన్ పల్లె'టూర్'… ఆ రోజు నుంచి మొదలు...

గ్రామస్థాయిలో రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని భావించిన ఏపీ ముఖ్యమంత్రి... త్వరలోనే ఇందుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: January 24, 2020, 2:01 PM IST
సీఎం జగన్ పల్లె'టూర్'… ఆ రోజు నుంచి మొదలు...
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్... అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు. వీటి అమలుపై ఎప్పటికప్పుడు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్... క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు ఏ రకంగా ఉన్నాయి ? పథకాల అమలు తీరు ఏ రకంగా జరుగుతుంది ? అనే అంశాలు తెలుసుకోవాలని కొద్దిరోజులుగా భావిస్తున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని భావించిన ఏపీ ముఖ్యమంత్రి... త్వరలోనే ఇందుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ కార్యక్రమానికి రచ్చబండ అనే పేరునే ఖరారు చేస్తారా ? లేక మరేదైనా పేరు పెడతారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టాలని భావించారు. ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
Published by: Kishore Akkaladevi
First published: January 24, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading