అంతా కేసీఆర్ వల్లే... ఏపీ మూడు రాజధానులపై కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య

మూడు రాజధానుల విధానం గురించి తాను ఎక్కడా వినలేదని... దేశంలో ఎక్కడా మూడు రాజధానుల విధానం లేదని వీహెచ్ అన్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 2:57 PM IST
అంతా కేసీఆర్ వల్లే... ఏపీ మూడు రాజధానులపై కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య
కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ సలహా కారణంగానే ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల విధానం గురించి తాను ఎక్కడా వినలేదని... దేశంలో ఎక్కడా మూడు రాజధానుల విధానం లేదని వీహెచ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా నిధులు లేవని... ఇప్పుడు మూడు రాజధానుల అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న రాజధాని రగడపై కేంద్రంలోని బిజెపి సర్కార్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం కేవలం బీసీలకు దళితులకు కాదు దేశంలోని ప్రతి ఒక్కరికి అవమానమని వీహెచ్ అన్నారు. దీనిపై ఈ నెల 25 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. పార్టీలో తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీని వీడనని... కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వీడి తప్పు చేశానని డిఎస్ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు