వైసీపీ ఎంపీ తీరుపై సీఎం జగన్ సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్..?

ధనికుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిషు మీడియం, పేదపిల్లలకు తెలుగు మీడియం అన్న విధానాన్ని సమర్థిస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఏ మాత్రం వెనకాడబోమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

news18-telugu
Updated: November 19, 2019, 10:58 PM IST
వైసీపీ ఎంపీ తీరుపై సీఎం జగన్ సీరియస్.. స్ట్రాంగ్ వార్నింగ్..?
సీఎం జగన్
  • Share this:
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశంపై ఇప్పటికే దుమారం రేగుతోంది. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంపై విపక్షాలు మండిడపడుతున్నాయి. తెలుగు భాషను చంపేస్తున్నారంటూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చేసిన ప్రసంగం హాట్‌టాపిక్‌గా మారింది. లోక్‌సభలో ఆయన ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఎంపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు క్లాస్‌ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వారంతా పేద వర్గాల పిల్లలేనని.. వారి జీవితాలు మారాలన్న మంచి ఆలోచనతోనే ఇంగ్లిషు మీడియం పెడుతున్నామని నేతలతో సీఎం జగన్ అన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా, వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా.. అటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే ఉండబోదని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ధనికుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిషు మీడియం, పేదపిల్లలకు తెలుగు మీడియం అన్న విధానాన్ని సమర్థిస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఏ మాత్రం వెనకాడబోమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.




First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com