కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ... ఆ తరువాతే అంటున్న జగన్ ?

మోదీని కలిసిన జగన్

వైసీపీ ఎన్డీయేలో చేరితే... కేంద్ర కేబినెట్‌లో రెండు మంత్రి పదవులతో పాటు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని బీజేపీ సంకేతాలు ఇచ్చిందని తెలుస్తోంది.

  • Share this:
    కేంద్రంలోని బీజేపీకి, ఏపీలోని అధికార వైసీపీ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మొదట్లో ఉన్నంత సఖ్యత ఇప్పుడు లేదనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతోంది. అయితే బీజేపీ మాత్రం ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయిన శివసేన స్థానాన్ని వైసీపీతో భర్తీ చేయాలనే యోచనతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య ఆరుకు పెరగనుండటంతో... వైసీపీతో తమకు పెద్ద సభలోనూ ప్రయోజం ఉంటుందనే భావనలో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది.

    వైసీపీ ఎన్డీయేలో చేరితే... కేంద్ర కేబినెట్‌లో రెండు మంత్రి పదవులతో పాటు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని బీజేపీ సంకేతాలు ఇచ్చిందని తెలుస్తోంది. బీజేపీ ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ సముఖంగానే ఉన్నా... ఎన్డీయేలో వైసీపీలో చేరేందుకు ఆయన బీజేపీ ముందు కొత్త కండీషన్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో వైసీపీ చేరాలంటే ఏపీకి విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని జగన్ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎన్డీయేలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన బీజేపీకి స్పష్టం చేసినట్టు సమాచారం.
    Published by:Kishore Akkaladevi
    First published: