విజయమ్మ సిఫార్సు... జగన్ గ్రీన్ సిగ్నల్... వైసీపీలో చర్చ

ఒక పదవి విషయంలో మాత్రం జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిఫార్సు పని చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: March 20, 2020, 9:21 AM IST
విజయమ్మ సిఫార్సు... జగన్ గ్రీన్ సిగ్నల్... వైసీపీలో చర్చ
అన్న జగన్, తల్లి విజయమ్మతో షర్మిల(pic: ToI)
  • Share this:
వైసీపీలో ఏ నిర్ణయమైనా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్ణయం తీసుకునే ముందు జగన్ ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుంటారు కానీ... ఫైనల్ డెసిషన్ మాత్రం పూర్తిగా ఆయనదే అని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతుంటాయి. అయితే ఓ విషయంలో మాత్రం జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిఫార్సు పని చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయానికొస్తే... నెల్లూరు జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌విని జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. దీంతో కీల‌క నాయ‌కులు ఈ ప‌ద‌వుల‌ను త‌మ వారికి ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు.

ఈ క్రమంలోనే సీనియ‌ర్ నాయ‌కుడు, వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన న‌ల్లప‌రెడ్డి ప్రస‌న్న కుమార్ రెడ్డి కూడా త‌మ వారికి ఈ ప‌ద‌వి కోసం ప్రయ‌త్నించారు. అయితే, దీనికి భిన్నంగా జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఆనం ఫ్యామిలీకి చెందిన ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి కూడా త‌న స‌తీమ‌ణి ఆనం అరుణ‌కు ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించారు. అయితే ఆనం ఫ్యామిలీ ఆదిలో టీడీపీలో ఉంద‌ని, జ‌గ‌న్‌పై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు కూడా చేశార‌ని, కాబ‌ట్టి ఈ ఫ్యామిలీకి ఇలాంటి కీల‌క ప‌ద‌వి ఇవ్వరాద‌ని పెద్ద ఎత్తున వైసీపీ నాయ‌కులు వ్యతిరేక‌త వ్యక్తం చేశారు.

అయితే, ఈ విష‌యంలో అనూహ్యంగా జగన్ తల్లి, వైసీపీ గౌర‌వాధ్యక్షురాలు వైఎస్ విజ‌యమ్మ జోక్యం చేసుకున్నట్టు స‌మాచారం.దీనికి కూడా కార‌ణం ఉంది. ఆనం సోద‌రుల రాకకు ముందుగానే ఆనం విజ‌య్‌కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న కుమారుడు కూడా వైఎస్ విజ‌య‌మ్మకు అనుచ‌రుడిగా సేవ‌లు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఆనంకు ఫేవ‌ర్ చేయాల‌ని భావించిన విజ‌య‌మ్మ ఆనం అరుణ విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌న సిఫార‌సు పంపారు.

విజయమ్మ సిఫార్లు చేయడంతో వైసీపీ త‌ర‌ఫున అరుణను నామినేట్ చేస్తున్నామ‌ని అధిష్టానం కూడా ప్రక‌టించింది. దీంతో వైసీపీ నాయ‌కులు ఒక్కసారిగా షాక‌య్యారు. పార్టీ ప్రారంభం నుంచి సుచ‌రిత వైఎస్ కుటుంబంతోను ముఖ్యంగా విజ‌య‌మ్మ, భార‌తిలోనూ సాన్నిహిత్యంగా ఉండి. వారి క‌ష్టాల‌ను సైతం పంచుకున్నారు. మొత్తానికి నెల్లూరు జ‌డ్పీ చైర్‌ప‌ర్సన్ విష‌యంలో విజ‌య‌మ్మ ఎంట్రీ తో వైసీపీ నేత‌లు షాక్ గురవుతున్నారు. కొందరు నేతలైతే... భవిష్యత్తులో తమకు కావాల్సిన పనులను విజయమ్మతో చేయించుకోవచ్చని భావిస్తున్నట్టు సమాచారం.
First published: March 20, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading