స్వరూపానంద స్వామిని కలవనున్న జగన్.. కేబినెట్‌కి ముహుర్తం పెడుతున్నారా?

మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: June 3, 2019, 9:55 AM IST
స్వరూపానంద స్వామిని కలవనున్న జగన్.. కేబినెట్‌కి ముహుర్తం పెడుతున్నారా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)
news18-telugu
Updated: June 3, 2019, 9:55 AM IST
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. జగన్ విశాఖ పర్యటన మంగళవారం ఖరారైనట్లు సీఎం కార్యాలయ వర్గాలు అంటున్నాయి. సోమవారం విశాఖ చేరుకోనున్న జగన్... విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. సోమవారం విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరిగి అమరావతి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత స్వరూపానందను జగన్ దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అంతకుముందు కూడా జగన్ స్వరూపానంద స్వామిని కలిశారు. విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామిజీ జగన్‌కు సన్నిహితుడు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్‌ స్వరూపానంద స్వామిని కలిసి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...