Home /News /politics /

Ap Capital: ‘‘ఆ ప్రాంతమంటే నాకేం వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ అక్కడే ఉంది”:  ఏపీ సీఎం జగన్​

Ap Capital: ‘‘ఆ ప్రాంతమంటే నాకేం వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ అక్కడే ఉంది”:  ఏపీ సీఎం జగన్​

అసెంబ్లీలో వైఎస్ జగన్

అసెంబ్లీలో వైఎస్ జగన్

మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్​ రెడ్డి ప్రసంగించారు. గుంటూరులో హైకోర్టు ఉండేదని చెప్పారు. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని తెలిపారు

    మూడు రాజధానుల బిల్లు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టులో అడ్వకేట్​ జనరల్​ శ్రీరామ్​ వెల్లడించడంతో ఏపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏడాదిన్నరగా అమరావతి (Amaravati)లో ధర్నా చేస్తున్న రైతులు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా అటు అమరావతి రైతులే కాకుండా, ఉత్తరాంధ్ర నుంచి కూడా పలువురు స్పందించారు. అయితే మంత్రులు మాత్రం ఏపీ రాజధాని (AP capital) విషయంపై అసెంబ్లీలో సీఎం స్పందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ రాజధాని (AP capital) అంశంపై అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్​ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రసంగించారు. గుంటూరు (Guntur)లో హైకోర్టు ఉండేదని చెప్పారు. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదన్నారు. తన ఇల్లు (house) కూడా ఇక్కడే ఉందని సీఎం తెలిపారు. అయితే ఇక్కడ కనీస వసతులు (Infrastructure) లేవని జగన్​ గుర్తుచేశారు. కనీస వసతులకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయిని సీఎం జగన్‌ తెలిపారు. 1953 నుంచి 1956  వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని (AP capital)గా కర్నూలు (Kurnool) ఉండేదని ముఖ్యమంత్రి  అన్నారు.

    సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ..

    అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని సీఎం జగన్ గుర్తుచేశారు. కాగా, రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

    గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయిందని తెలిపారు. మరోసారి హైదరాబాద్‌ (Hyderabad) లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని జగన్‌ చెప్పారు. కాబట్టే వికేంద్రీకరణే  (Decentralization) సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని జగన్‌ తెలిపారు.

    ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని..

    అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు.. వీరందరి ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని సీఎం జగన్​ అన్నారు. అందుకే తమ ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారని జగన్​ చెప్పారు.

    ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా..

    మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు.

    అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్‌ (CM jagan) స్పష్టం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh assembly session, Ap capital, Guntur, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు