అమిత్ షాతో కుదరని భేటీ.. ఢిల్లీలోనే సీఎం వైఎస్ జగన్

సోమవారం కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఆ భేటీలన్నీ మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది.

news18-telugu
Updated: October 21, 2019, 10:57 PM IST
అమిత్ షాతో కుదరని భేటీ.. ఢిల్లీలోనే సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 21, 2019, 10:57 PM IST
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కుదరలేదు. పలు కారణాలతో అమిత్ షా అపాయింట్‌మెంట్ జగన్‌కు లభించనట్లు సమాచారం. దాంతో అమిత్ షాతో జగన్ సమావేశం మంగళవారానికి వాయిదాపడింది. అమిత్ షా తర్వాత ఇతర కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు ఏపీ సీఎం. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై కేంద్రంతో చర్చిస్తారు జగన్. ప్రభుత్వ పథకాలు, కృష్ణా-గోదావరి అనుసంధానానికి చేయూతనివ్వాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేసే అవకాశముంది.

కాగా, వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నమే సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సి ఉంది. ఐతే సోమవారం కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఆ భేటీలన్నీ మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది. మరి మంగళవారమే సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఏపీకి చేరుకుంటారా.. లేదంటే అక్కడే బస చేస్తారా.. అన్నది తెలియాల్సి ఉంది.First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...