• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM YS JAGAN MOHAN REDDY TAKEN SOME DECISIONS TO CONVINCE BRAHMIN COMMUNITY AK

జగన్ ముందు జాగ్రత్త... వారిని సంతృప్తి పరిచేందుకేనా..?

జగన్ ముందు జాగ్రత్త... వారిని సంతృప్తి పరిచేందుకేనా..?

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై విశాఖ జిల్లాకు చెందిన అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

  • Share this:
    ఏపీలో తాను ఏరికోరి తెచ్చుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆకస్మికంగా బదిలీ చేయాల్సి రావడంతో బ్రాహ్మణ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించినట్లు కనిపిస్తోంది. ఎల్వీ ఆకస్మిక ఉద్వాసనపై విశాఖ జిల్లాకు చెందిన అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. అందులో జగన్ నిర్ణయంపై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రభుత్వ నిర్ణయంపై తన సామాజిక వర్గం తీవ్ర ఆవేదనకు గురైందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో పాటు బ్రహ్మణ సంఘాల నేతలు కూడా జగన్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

    lv subramanyam,lv subrahmanyam ias,lv subrahmanyam ias biodata,lv subramanyam caste,lv subramanyam native place,lv subramanyam retirement date,lv subramanyam transfer news,lv subramanyam full name,ఎల్వీ సుబ్రమణ్యం,ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ,ఎల్వీ సుబ్రమణ్యం బయోడేటా,ఎల్వీ సుబ్రమణ్యం కులం ఏంటి,ఎల్వీ సుబ్రమణ్యం రిటైర్‌మెంట్ డేట్,ఎల్వీ సుబ్రమణ్యం జగన్ మధ్య తేడా ఎందుకొచ్చింది,బాపట్ల హెచ్ఆర్డీ,Bapatla HRD DG,
    ఎల్ వీ సుబ్రహ్మణ్యం


    దీంతో జగన్ దీనికి విరుగుడుగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంచిన రమణదీక్షితుల వ్యవహారాన్ని ఆకస్మికంగా తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పించిన రమణదీక్షితులను తిరిగి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో, తక్షణ ఉపశమనంగా ఆయన్ను టీటీడీ ఆగమ సలహాదారుగా నియమించారు. దీంతో పాటు గత ప్రభుత్వం తప్పించిన ఆయన ఇద్దరు కుమారులను తిరిగి శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు. దీంతో రమణ దీక్షితులతో పాటు బ్రాహ్మణ వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది.

    ttd ex priest ramana deekshitulu demands to take him into post again
    రమణ దీక్షితులు (ఫైల్ ఫొటో)


    జగన్ అంతటితో ఆగకుండా టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను ఢిల్లీలోని ఏపీ భవన్ కు మార్చే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై రేపోమాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయన స్ధానంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికే చెందిన జేఎస్వీ ప్రసాద్‌ను ఈవోగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    గతంలో విద్యాశాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న జేఎస్వీ ప్రసాద్ ను ఈ మధ్యే బదిలీల్లో తప్పించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం కంటే ముందే ఆయనను తప్పించారు. అదే సమయంలో ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఒకేసారి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు జేఎస్వీ, ఎల్వీకి షాక్ ఇచ్చినట్లయింది. కాబట్టి వీరిలో జేఎస్వీ ప్రసాద్‌కు టీటీడీ ఈవోగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా బ్రహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తి లేకుండా చేయొచ్చనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

    సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరెస్పాండెంట్, విజయవాడ
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు