పురంధేశ్వరికి జగన్ బంపర్ ఆఫర్... అసలు విషయం చెప్పిన ఏపీ మంత్రి

కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి వైసీపీలో చేరితే ఆమెకు కీలకమైన పదవి ఇచ్చేందుకు అధినేత వైఎస్ జగన్ ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 18, 2019, 5:00 PM IST
పురంధేశ్వరికి జగన్ బంపర్ ఆఫర్... అసలు విషయం చెప్పిన ఏపీ మంత్రి
వైఎస్ జగన్, పురంధేశ్వరి
  • Share this:
గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున పోటీ చేసిన సీనియర్ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ పక్కనపెట్టిందనే న్యూస్ ఈ మధ్యకాలంలో తెగ చక్కర్లు కొడుతోంది. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ నేత రామనాథం బాబు తిరిగి పార్టీలోకి రావడంతో... జగన్ ఇక దగ్గుబాటిని పక్కనపెట్టినట్టే అనే ప్రచారం మొదలైంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే... కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరిని వైసీపీలోకి తీసుకురావాలని సీఎం జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కండిషన్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది.

అయితే ఇందులో వాస్తవం ఏమిటనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే తాజాగా రామనాథం బాబుపై తనకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలతో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి వారితో అన్నారని సమాచారం. సీఎం జగన్‌పై పురంధేశ్వరి విమర్శలు బాధించాయని... పురంధేశ్వరి వైసీపీలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆయన పర్చూరు వైసీపీ శ్రేణులతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది దగ్గుబాటి వెంకటేశ్వరరావే అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్చూరు వైసీపీ కార్యకర్తలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజకీయంగా కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉన్న పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు... తమపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

First published: October 18, 2019, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading