హోమ్ /వార్తలు /politics /

మళ్లీ మూడు రాజధానుల బిల్లు.. YS Jagan ప్లాన్ అదేనా ?.. KCR తరహాలో.. మళ్లీ చంద్రబాబుకు చిక్కులు ?

మళ్లీ మూడు రాజధానుల బిల్లు.. YS Jagan ప్లాన్ అదేనా ?.. KCR తరహాలో.. మళ్లీ చంద్రబాబుకు చిక్కులు ?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

YS Jagan: ఈ బిల్లు ఇదే రకంగా ఉంటే న్యాయపరంగా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. అందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక సీఎం జగన్ వ్యూహం మరొకటి ఉండొచ్చనే వాదన ఉంది.

ఇంకా చదవండి ...

ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మూడు రాజధానులు(Three capitals)  ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామనే నినాదంతో ముందుకు సాగుతున్న వైసీపీ.. కొన్నేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఉపసంహరించుకుంది. దీనిపై అసెంబ్లీలో వివరణ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. దీనిపై కొందరు లేవనెత్తుతున్న అపోహలు, అవంతరాలు, సందేహాలను నివృత్తి చేసుకుంటూ కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని తెలిపారు. దీన్నిబట్టి తాత్కాలికంగా మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గినా.. భవిష్యత్తులోనైనా తమ విధానం మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే అనే విషయాన్ని సీఎం జగన్ (YS Jagan)  స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనే అంశంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ బిల్లు ఇదే రకంగా ఉంటే న్యాయపరంగా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. అందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక సీఎం జగన్ వ్యూహం మరొకటి ఉండొచ్చనే వాదన ఉంది. ఏపీ రాజధానిగా అమరావతి(Amaravati)  మాత్రమే ఉండాలని టీడీపీ గట్టిగా పట్టబడుతోంది. జనసేన కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇటీవల బీజేపీ సైతం అమరావతికి పూర్తిస్థాయిలో జైకొట్టింది.

ఈ నేపథ్యంలో వీళ్లందరినీ ఇరుకున పెట్టేలా మూడు రాజధానుల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని.. అలా చేయడం ద్వారా ఈ పార్టీలన్నీ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఇబ్బందిపడతాయన్నది జగన్ వ్యూహం కావొచ్చన్నది ఓ వాదన. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పి వైసీపీ మరోసారి ప్రజల్లోకి వెళ్లి.. ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా టీడీపీని ఇరకాటంలో పడేయాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యూహాన్ని అమలు చేసి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఈ అంశంపై వైసీపీ అనుకున్న వ్యూహం ఫలిస్తే.. రాజకీయంగా టీడీపీ మరింత ఇబ్బందిపడుతుందనే భావనలో అధికార పార్టీ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఎన్నికలకు ముందు ఈ మూడు రాజధానుల బిల్లును మరింత సమగ్రంగా, సవివరంగా రూపొందించి అసెంబ్లీలో పెట్టాలని.. ఆ తరువాత ఈ అంశాన్నే ఎన్నికల అంశంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

AP Capital Issue: మూడు రాజధానులపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన సీఎం జగన్.. మళ్లీ కొత్త బిల్లు వచ్చేది ఎప్పుడు.. నెక్ట్స్ ఏంటి ?

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

ఓ వైపు ప్రజలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ఈ అంశం ద్వారా ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపాలని వైసీపీ ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు. ప్రత్యర్థులు ఊహించని విధంగా రాజకీయ ఎత్తులు వేస్తుంటారు. అయితే ఈసారి వైఎస్ జగన్ అలాంటి ఎత్తు వేసి తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా చేశారనే చర్చ జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు