వైసీపీ నేతకు జగన్ కొత్త కండీషన్... కారణం ఇదే ?

వైసీపీలో సైలెంట్‌గా ఉన్న సీనియర్ రాజకీయ నేతకు సీఎం వైఎస్ జగన్ కొత్త కండీషన్ పెట్టినట్టు రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 10, 2019, 12:09 PM IST
వైసీపీ నేతకు జగన్ కొత్త కండీషన్... కారణం ఇదే ?
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో పాటు రాజకీయంగానూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన సీఎం జగన్... వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్‌తో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలకు ఆయన చెక్ చెబుతున్నారని తెలుస్తోంది. సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలోనూ జగన్ ఇదే రకంగా ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

దీంతో వైసీపీలో కొనసాగుతారా ? లేక భార్య పురంధేశ్వరితో కలిసి బీజేపీలోకి వెళతారా ? అన్న అంశంపై క్లారిటీ రావడం లేదు. వైసీపీ ఓడిపోయిన పర్చూరులో పార్టీని పటిష్టం చేసేందుకు పర్చూరుకు చెందిన వైసీపీ మాజీ నేత రాంబాబును తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు జగన్. ఈ విషయం దగ్గుబాటికి తెలియదని జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీకి జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Ap news, ap latest news, ap politics, Daggubati venkateshwara rao, parchuru, cm jagan vs daggubati, ap cm ys jagan warns daggubati, ysrcp, ap cm ys jagan mohan reddy, jagan warning to daggubati venkateshwara rao, daggubati family in dilemma, daggubati purandeswari, daggubati venkateshwara rao may join bjp, daggubati Hitesh chenchuram, prakasam district, balineni Srinivasa reddy, tdp, bjp, chandrababu naidu, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పర్చూరు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రకాశం జిల్లా, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, ఏపీ లేటెస్ట్ న్యూస్
దగ్గుబాటి దంపతులు, వైఎస్ జగన్ ఫైల్


వైసీపీలో ఉంటారో లేదో తేల్చుకోవాలని ఆయన దగ్గుబాటి ఫ్యామిలీకి స్పష్టమైన సంకేతాలు పంపించారని సమాచారం. ఒకవేళ వైసీపీలో కొనసాగే ఆలోచన ఉంటే పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని సీఎం జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సమాచారం ఇచ్చినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: October 10, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading