గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ... బడ్జెట్ సమావేశాలపై చర్చ

పీ ప్రభుత్వం ఈనెల 12వ తేదీన రాష్ట్రబడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని కూడా సిద్ధం చేసింది.

news18-telugu
Updated: July 9, 2019, 11:59 AM IST
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ... బడ్జెట్ సమావేశాలపై చర్చ
సీఎం జగన్, గవర్నర్ నరసింహన్
news18-telugu
Updated: July 9, 2019, 11:59 AM IST
విజయవాడలోతెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గేట్ వే హోటల్‌కు చేరుకున్న జగన్... గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మహాత్మాగాంధీ రోడ్డులోని గేట్‌వే హోటల్ కి ఉదయమే గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఇద్దరు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఈనెల 12వ తేదీన రాష్ట్రబడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ సాఫ్ట్ కాపీ సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...