Home /News /politics /

ఏపీ డిప్యూటీ సీఎంకు ఆ పదవి... జగన్ నిర్ణయం ?

ఏపీ డిప్యూటీ సీఎంకు ఆ పదవి... జగన్ నిర్ణయం ?

జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్(ఫైల్ ఫోటో)

జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్(ఫైల్ ఫోటో)

శాసనమండలి రద్దయితే ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు దక్కబోయే పదవిపై రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది.

    ఏపీలో శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీంతో మండలిలో వైసీపీ సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. మండలి రద్దుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీరిద్దరూ తమ మంత్రి పదవులు కోల్పోనున్నారు. మండలి రద్దుపై పార్లమెంట్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంతో ఉన్న వైసీపీ... మంత్రులు పిల్లి, మోపిదేవిలకు జగన్ భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఇస్తారో అనే అంశంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

    వీరిలో ఒకరికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుండగా... డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మరో పదవి ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి డిసైడయ్యారనే ప్రచారం తూర్పు గోదావరి జిల్లా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మంత్రి పదవి కోల్పోతే పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గుడా(గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ) చైర్మన్ పదవి ఇవ్వనున్నారని సమాచారం. టీడీపీ హయాంలో ఏర్పాటైన ఈ సంస్థ పరిధిని మరింతగా విస్తరించి ఆ పదవిని మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్‌కు ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రస్థాయి నేతగా ఉన్న పిల్లి... జిల్లా స్థాయి పదవిని తీసుకుంటారా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pilli Subhash Chandra Bose, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు