Home /News /politics /

CM YS JAGAN MOHAN REDDY MAY CONSIDER LAKSHMI PARVATHI FOR APSRTC CHAIRMAN POST AK

లక్ష్మీపార్వతిని ఈసారైనా జగన్ కరుణిస్తారా... ఆ పదవి దక్కేనా ?

సీఎం జగన్, లక్ష్మీపార్వతి

సీఎం జగన్, లక్ష్మీపార్వతి

తాజాగా ఏపీలో ఆర్టీసీ చైర్మన్ పదవి ఖాళీ కావడంతో... ఈ పోస్టు లక్ష్మీపార్వతికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

    వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ వాయిస్‌ను బలంగా వినిపించిన వారిలో దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఒకరు. వైసీపీ ఆవిర్భావించిన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీలో చేరిన లక్ష్మీపార్వతి... మొదటి నుంచి జగన్ వెంటే ఉన్నారు. అయితే ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి పదవి రాలేదు. గతంలోనే లక్ష్మీపార్వతికి ఎమ్మెల్సీ సీటు ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వారికి కీలకమైన పదవులు ఇచ్చిన సీఎం జగన్... లక్ష్మీపార్వతికి మాత్రం ఇంకా ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ఆమె వైసీపీలో సైలెంట్ అయ్యారనే వార్తలు కూడా మొదలయ్యాయి.

    అయితే తాజాగా ఏపీలో ఆర్టీసీ చైర్మన్ పదవి ఖాళీ కావడంతో... ఈ పోస్టు లక్ష్మీపార్వతికి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన వర్ల రామయ్య... వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తరువాత ఈ పదవికి రాజీనామా చేశారు. వర్ల రామయ్య ఈ పదవికి రాజీనామా చేయడంతో... ఇప్పుడు వైసీపీలో ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ చైర్మన్ పోస్టు లక్ష్మీపార్వతికి దక్కొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అయితే కీలకమైన ఈ నామినేటెడ్ పోస్టును వైసీపీలోని సీనియర్ నేతలైన అంబటి రాంబాబు సహా పలువురు ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారా లేక ఆమెకు మరేదైనా పదవి ఆఫర్ చేస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Apsrtc, Lakshmi Parvathi, Varla ramaiah, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు