YS Jagan: పట్టాభి తిట్లపై సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్.. ఇన్ని బూతులు ఎప్పుడూ వినలేదు

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh Politics: వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై ఎన్నికల సంఘం నిషేధం విధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

 • Share this:
  ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. నేతల మాటల మంటతో రచ్చ రచ్చ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. నిన్న సీఎం జగన్‌పై పట్టాభి బూతులు తిట్టడం, ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంతో... రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అటు వైసీపీ కూడా టీడీపీ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలపై సీఎం జగన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును ఓర్వలేక విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు జగన్. ఎవరెన్ని చేసినా ప్రజల కోసం తమ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

  '' మాపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంచి పనులను చూసి ఓర్వలేకపోతున్నారు. ఓ వర్గం మీడియా కూడా తట్టుకోలేకపోతోంది. మంచి పనులను ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేదలకు మేలు జరిగితే జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కుట్రలు చేస్తున్నారు. నన్ను కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. గతంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి బూతులు మాట్లడలేదు. ఆ బూతులు విని కొందరు మా అభిమానులు, కార్యర్తలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అవే కారణం. టీడీపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చులుపెడుతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పేదలు మంచి చేస్తూనే ఉంటాం.'' అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

  Chandrababu AP Bandh: ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్

  నిన్న మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత పట్టాభి.. సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ బూతులపై వైసీపీ శ్రేణులు భగ్గమన్నాయి. పట్టాభి నివాసంతో పాటు అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా దాడులకు పాల్పడ్డారు. సిబ్బందిపై దాడిచేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడిని ఉగ్రదాడిగా అభివర్ణించారు. అందుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు పలు చోట్ల వైసీపీ శ్రేణులు రోడ్లపైకి చేరుకొని ఆందోళనలు చేపట్టాయి. ఐతే నేతలను మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గృహనిర్బంధం చేశారు. నేతలకు ఇళ్లకే పరిమితం చేయడంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

  Andhra Pradesh : ఏపీలో గంజాయి ల‌డాయి.. పార్టీల మ‌ధ్య మాట‌లు దాటి.. చేత‌ల్లోకి వెళ్తున్న వైనం

  మరోవైపు వైసీపీ నేతలు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై ఎన్నికల సంఘం నిషేధం విధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంపై రెండు మూడు బల్లలు, కుర్చీలు విరిగితే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లా? మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. దమ్ముంటే నెల్లూరు రావాలని, ఎవరి ప్రతాపమేంటో తేల్చుకుందామని ధ్వజమెత్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published: