అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ఏం చర్చించారంటే...

ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు.

news18-telugu
Updated: October 22, 2019, 1:52 PM IST
అమిత్ షాతో భేటీలో సీఎం జగన్ ఏం చర్చించారంటే...
అమిత్ షాతో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 22, 2019, 1:52 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో సీఎం జగన్ చర్చించారు. చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలని కోరారు.

2014-2015లో రెవిన్యూలోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారని సీఎం జగన్ అమిత్ షాకు గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టంద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం అంశం భేటీలో చర్చకు వచ్చింది. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ. 400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారని సీఎం జగన్ అమిత్ షాతో అన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని కోరారు.

ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు ఏడాదికి రూ. కోట్లు చొప్పున ఇప్పటివరకూ రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదాచేశామని అమిత్ షాకు వివరించారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరదజలాల తరలింపు అంశాన్ని సీఎం జగన్ కేంద్రంతో చర్చించారు.First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...