రఘురామకృష్ణంరాజుకు బిగ్ షాక్.. పావులు కదుపుతున్న జగన్

ఎవరైనా పార్టీ విధానాలకు లోబడే ఉండాలనే అంశాన్ని గట్టిగా తెలియజేయాలంటే... రఘురామకృష్ణంరాజు సభ్యత్వం రద్దయ్యేలా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ యోచిస్తున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: June 30, 2020, 6:38 AM IST
రఘురామకృష్ణంరాజుకు బిగ్ షాక్.. పావులు కదుపుతున్న జగన్
రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలోని అధికార వైసీపీలో కాక రేపిన రఘురామకృష్ణంరాజుకు బిగ్ షాక్ ఇవ్వాలని సీఎం జగన్ డిసైడయ్యారా ? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజు ఎంపీ సభ్యత్వం రద్దు చేసేలా వైసీపీ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిన్నమొన్నటి వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్న వస్తున్న రఘురామకృష్ణంరాజు... తాను పార్టీకి విధేయుడినంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు లేఖ రాశారు. అయితే వైసీపీకి చెందిన ఎంపీ బాలశౌరి పలువురు కేంద్రమంత్రులను కలిసిన తరువాత ఢిల్లీలో పరిణామాలు మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే... ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయ్యేలా చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. బాలశౌరి కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశం కావడం వెనుక అసలు కారణంగా కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జేడీయూ ఎంపీ శరద్ యాదవ్‌పై రాజ్యసభలో వేటు పడిన విషయాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అదే రకంగా రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలనే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ రఘురామకృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేస్తే... భవిష్యత్తులో ఆయన బాటలోనే మరికొందరు పయనించే అవకాశం లేకపోలేదనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. ఎవరైనా పార్టీ విధానాలకు లోబడే ఉండాలనే అంశాన్ని గట్టిగా తెలియజేయాలంటే... రఘురామకృష్ణంరాజు సభ్యత్వం రద్దయ్యేలా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ యోచిస్తున్నట్టు సమాచారం.
First published: June 30, 2020, 6:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading