ఆ ఫ్యామిలీకి డెడ్‌లైన్ విధించిన జగన్

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలంటే... పురంధేశ్వరి కూడా వైసీపీలోకి రావాలని వైసీపీ కండీషన్ పెడుతోంది.

news18-telugu
Updated: October 24, 2019, 7:06 PM IST
ఆ ఫ్యామిలీకి డెడ్‌లైన్ విధించిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఎన్టీఆర్ పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలంటే... పురంధేశ్వరి కూడా వైసీపీలోకి రావాలని వైసీపీ కండీషన్ పెడుతోంది. వైసీపీలోకి వస్తే పురంధేశ్వరికి రాజ్యసభ సీటుతో పాటు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ పోస్టును హితేష్‌కు ఇస్తామని వైసీపీ అధినాయకత్వం చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉండాలనే విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని.. ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

మరో వారం రోజుల్లో పర్చూరు పంచాయితీపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు బాలినేని. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా తన కుమారుడు హితేష్ చెంచురామ్ ను నియమించాలంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే పురందేశ్వరి కూడా వైసీపీలోకి వస్తే ఆమెకు పార్టీలో సముచిత స్థానం తోపాటు హితేష్ కు ఇంచార్జి బాధ్యతలు ఇస్తామని వైసీపీ చెబుతోంది.దీన్ని బట్టి వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ ఫ్యూచర్ ఏంటో అక్టోబర్ చివరి నాటికి తేలే అవకాశం ఉంది.


First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>