చంద్రబాబుపై సరికొత్త అస్త్రాలు... అసెంబ్లీలో పక్కా స్కెచ్

గత జులై నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిశాక మళ్లీ అసెంబ్లీ సమావేశం కాలేదు. దీంతో ఈ సమావేశాలపై రాష్ట్రంలో అందరి దృష్టీ నెలకొంది.

news18-telugu
Updated: December 5, 2019, 1:31 PM IST
చంద్రబాబుపై సరికొత్త అస్త్రాలు... అసెంబ్లీలో పక్కా స్కెచ్
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఈ నెల 9న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఉన్న అధికార వైసీపీ అందుకు తగ్గ అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో బాగంగా టీడీపీ చేసే విమర్శలకు తగినట్లుగా స్పందించేలా ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఫైర్ బ్లాండ్లను గుర్తించి సిద్దం చేస్తోంది. ఇందులో కృష్ణా జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో పాటు మాజీ జర్నలిస్టు కూడా అయిన మంత్రి కన్నబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది. వీరికి తోడుగా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబును కూడా రంగంలోకి దింపనుంది.

గత జులై నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిశాక మళ్లీ అసెంబ్లీ సమావేశం కాలేదు. దీంతో ఈ సమావేశాలపై రాష్ట్రంలో అందరి దృష్టీ నెలకొంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు ముగిసాయి....ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది.. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల తో పాటు మేనిఫేస్టో లో ప్రకటించిన కొన్ని అంశాలను ఇప్పటికే అమలు చేస్తోంధి ప్రభుత్వం. అయినా విపక్షాల నుంచి విమర్శలు మాత్రం తప్పడం లేదు. దీంతో ఈసారి ప్రతిపక్షాన్ని పూర్తిస్దాయిలో టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని ఆలోచనలో జగన్ కనిపిస్తున్నారు.

Ap assembly sessions, chief whip srikanth reddy, chief whip srikanth reddy on ap assembly sessions, tdp, ysrcp, chandrababu naidu, ys jagan mohan reddy, ఏపీ అసెంబ్లీ సమావేశాలు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ, వైసీపీ, చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఏపీ అసెంబ్లీ భవనం (File)


వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడుతున్నారు. వల్లభనేని వంశీ వ్యవహారంలో టీడీపీ చేసిన విమర‌్శలకు తీవ్ర స్థాయిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలో విమర్శలు ఎదురైనా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు అమరావతి పర్యటనపైనా కొడాలి నాని ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో విషయం వివరించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీలో కీలక పాత్ర పోషించేందుకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు సీఎం కీలక బాధ్యతలు అప్పగించారు.

వీరితో పాటు మరో మంత్రి కన్నబాబుకు అసెంబ్లీలో జరిగే ప్రధాన శాఖల చర్చల్లో కీలక భాగస్వామ్యం అవ్వాలని కూడా సీఎం సూచనలు అందించారు..దీంతో వీరు కొంత మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు....గత అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి కొంత ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో ఓవర్ టేక్ చేసింది..ఇప్పుడు ఈ పరిస‌్థితి ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు విపక్షాలకు కూడా కీలకం కాబోతున్నాయి. ప్రభుత్వం ఆరునెలలు పూర్తి చేసుకోవడం, రోజుకో పథకాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అడ్డుకోకపోతే భవిష్యత్తులో తమ పరిస్దితి అగమ్యగోచరంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. అందుకే టీడీపీ నేతలు రాష్ట్రంలో సమస్యలపై గట్టిగా హోమ్ వర్క్ చేస్తున్నారు. వారిని తట్టుకోవాలంటే ముందస్తు వ్యూహరచన తప్పదనే భావనలో ప్రభుత్వం కనిపిస్తోంది. అందుకే ఫైర్ బ్రాండ్ నేతలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించింది.

సయ్యద్ అహ్మద్, న్యూస్18 ప్రతినిధి, విజయవాడ
Published by: Kishore Akkaladevi
First published: December 5, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading