CM YS JAGAN MAY GIVE CLARITY ON NEW DISTRICT IN AP ON OR BEFORE JAN 26 AK
ఏపీలో కొత్త జిల్లాలు... టార్గెట్ ఫిక్స్ చేసుకున్న సీఎం జగన్ ?
ప్రతీకాత్మక చిత్రం
పరిపాలనలో తనదైన మార్కు చూపించాలని భావిస్తున్న సీఎం జగన్... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మరో ముందడుగు వేసినట్టు అవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడు జరుగుతుంది ? అధికారంలోకి వచ్చిన మొదట్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న సీఎం వైఎస్ జగన్... ఆ తరువాత ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావించడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం జగన్ మరోసారి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆయన ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసినప్పుడు చర్చించారని సమాచారం. ఏపీలో సమగ్ర భూ సర్వే చేపట్టే యోచనలో ఉన్న ప్రభుత్వం... కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పరిపాలనలో తనదైన మార్కు చూపించాలని భావిస్తున్న సీఎం జగన్... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మరో ముందడుగు వేసినట్టు అవుతుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ఆలోచనలో ఉన్న జగన్... వీటికి అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఆరాతీస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.