• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CM YS JAGAN INVITED TO LAUNCH OF KIA NEW CAR ON 8 AUG SB

మార్కెట్లోకి కియా కారు.... సీఎం జగన్‌కు ఆహ్వానం

మార్కెట్లోకి కియా కారు.... సీఎం జగన్‌కు ఆహ్వానం

జగన్‌ను ఆహ్వానించిన కియా కారు కంపెనీ

2018 ఫిబ్రవరి 22న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కియ చైర్మన్‌ హన్‌హూ పార్కు ఆధ్వర్యంలో ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

  • Share this:
    ఈనెల 8న మధ్యాహ్నం కియా కంపెనీ తన కొత్తకారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమలో తయారైన తొలికారు సెల్టోస్. సోమవారం కియ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగరాజుకు అందజేశారు.  జిల్లాలోని అమ్మవారిపల్లి వద్ద 600 ఎకరాల్లో కియ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ క్రమంలో 2018 ఫిబ్రవరి 22న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కియ చైర్మన్‌ హన్‌హూ పార్కు ఆధ్వర్యంలో ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

    2019 జనవరి 29న మరోమారు చంద్రబాబునాయుడు, కియా చైర్మన్‌ హన్‌హూ పార్కు, కియ మోటార్స్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ కూక్‌హ్యూన్‌షిం, రాష్ట్ర మంత్రులతో కలసి ట్రయల్‌ ప్రొడక్షన్‌కు స్విచ్‌ ఇన్‌ చేసి ప్రారంభించారు. అనంతరం కియా తొలికారును టెస్ట్‌ ట్రాక్‌లో చంద్రబాబునాయుడు స్వయంగా నడిపారు. ఇప్పుడు అదే పరిశ్రమలో తయారైన సెల్టోస్‌ కియా కారును మార్కెట్‌లోకి విడుదల చేయడానికి  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పరిశ్రమలో ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు.

    First published: