జగన్ ద్వంద నీతి... ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ

బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో సీఎం జగన్ ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 10, 2019, 11:58 AM IST
జగన్ ద్వంద నీతి... ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ
సీఎం జగన్
  • Share this:
రాజకీయాల్లో రూల్స్ ఉండవు. మనం ఏం ఫాలో అయితే అవే రూల్స్‌గా మారిపోతాయి. తాజాగా ఏపీలోని అధికార వైసీపీలోనూ ఇదే రకమైన ట్రెండ్ నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా... ఆలోచిస్తే ఇదే నిజమని ఎవరికైనా అనిపిస్తోంది. అసలు విషయనికొస్తే... బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీ కొద్ది గంటల క్రితమే వైసీపీ తీర్థం పుచ్చుకుంది. గంగరాజు కుమారులు, ఆయన తమ్ముడు అఫీషియల్‌గా వైసీపీలో చేరిపోయారు. అయితే మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చిన ఆయన మాత్రం వైసీపీలో చేరలేదు. అంటే ఆయన ఇంకా బీజేపీలోనే ఉన్నట్టు లెక్క.

అయితే ఇదే ఇప్పుడు వైసీపీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గుబాటి ఫ్యామిలీలోని పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా... ఆమె భర్త వెంకటేశ్వరరావు, తనయుడు హితేష్‌ను పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మరోవైపు బీజేపీ తరపున విశాఖ ఎంపీగా పురందేశ్వరి పోటీ చేశారు.

Ap news, ap latest news, ap politics, Daggubati venkateshwara rao, parchuru, cm jagan vs daggubati, ap cm ys jagan warns daggubati, ysrcp, ap cm ys jagan mohan reddy, jagan warning to daggubati venkateshwara rao, daggubati family in dilemma, daggubati purandeswari, daggubati venkateshwara rao may join bjp, daggubati Hitesh chenchuram, prakasam district, balineni Srinivasa reddy, tdp, bjp, chandrababu naidu, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పర్చూరు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రకాశం జిల్లా, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, ఏపీ లేటెస్ట్ న్యూస్
దగ్గుబాటి దంపతులు, వైఎస్ జగన్ ఫైల్


అయితే ఎన్నికల తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని జగన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కండిషన్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఉంటే కుటుంబసభ్యులంతా ఒకే ఫ్యామిలీలో ఉండాలని జగన్ వారికి స్పష్టం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకు దుగ్గుబాటి వెంకటేశ్వరరావు నో చెప్పడం.... వైసీపీకి దూరం కావడం జరిగిపోయాయి.Cm ys jagan, daggubati purandeshwari, gokaraju gangaraju, ysrcp, bjp, ap news, ap politics, సీఎం జగన్, దగ్గుబాటి పురంధేశ్వరి, గోకరాజు గంగరాజు, వైసీపీ, బీజేపీ, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గోకరాజు కుటుంబసభ్యులు


అయితే గోకరాజు గంగరాజు బీజేపీలో ఉండగానే... ఆయన కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకోవడం ఆ పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే గోకరాజు గంగరాజు ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా లేరని... కాబట్టి ఈ విషయంలో ఆ కుటుంబానికి మినహాయింపు ఇచ్చి ఉంటారనే వాదన కూడా ఉంది. మొత్తానికి వైసీపీలో సరికొత్త రూల్... ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>