మళ్లీ నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం... ఎందుకంటే ?

Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: October 18, 2019, 2:41 PM IST
మళ్లీ నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం... ఎందుకంటే ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 18, 2019, 2:41 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అవతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు ఏపీ ప్రభుత్వం. తమకు ఇష్టం లేని విభజన కావడంతో జూన్ 2న అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి నాటి ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించలేదు. ఇందుకు బదులుగా జూన్ 2 నుంచి వారం పాటు నవ నిర్మాణ దీక్షలు చేస్తూ వచ్చారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో... ఏపీ అవతరణ దినోత్సవంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీ అవతరణ దినోత్సవంపై నిర్ణయం తీసుకుంటామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించారు.

ఇందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరినట్టు సమాచారం. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ... ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని అప్పట్లో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే గత ప్రభుత్వం అవతరణ దినోత్సవం జరిపేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్‌ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఏపీ అవతరణ దినోత్సవం వేడుకలు...ఈ సారి జరగడం ఖాయంగా కనిపిస్తోంది.First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...