Home /News /politics /

CM YS JAGAN DECIDED REVERSE TENDERING OF POLAVARAM PROJECT MS

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌కు జగన్ నిర్ణయం.. 17న నోటిఫికేషన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

Polavaram Reverse Tendering : పోలవరంలో అవినీతిపై నిపుణుల కమిటీ జల వనరుల శాఖకు ఇచ్చిన నివేదిక మేరకే రివర్స్ టెండరింగ్ చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

    పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ రెండింటికి కలిపి రూ.5070కోట్లకు టెండర్లు పిలవనున్నారు.ఈ మేరకు అగస్టు 17న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. పోలవరంలో అవినీతిపై నిపుణుల కమిటీ జల వనరుల శాఖకు ఇచ్చిన నివేదిక మేరకే రివర్స్ టెండరింగ్ చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో దాదాపు రూ.3వేల కోట్ల పైచిలుకు అవినీతి జరిగిందని.. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని చెబుతోంది.అయితే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు చట్టబద్దత ఎక్కడ ఉందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందని హెచ్చరించినట్టు సమాచారం.అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనుల్లో వేగం,పారదర్శక పెరగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా? లేదా అన్నది చూడాలి.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Polavaram, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు