డిసెంబర్ 9... ఆ మంత్రులకు జగన్ డెడ్‌లైన్ ?

వంశీ బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకు వస్తే... ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుందని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: December 4, 2019, 5:56 PM IST
డిసెంబర్ 9... ఆ మంత్రులకు జగన్ డెడ్‌లైన్ ?
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీలో మళ్లీ వలసలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే వైసీపీలోకి రానున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలతో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారని... దీనికి సంబంధించిన విషయాలను వాళ్లు సీఎం జగన్‌కు కూడా వివరించారని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చే వైసీపీ వ్యూహరచన చేయడం వెనుక ఉన్న ఒకే ఒక్క లక్ష్యం... ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే అనే ప్రచారం కూడా ఉంది.

మరికొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకు వస్తే... ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుందని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యే నాటికి సాధ్యమైనంత ఎక్కువమంది టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నుంచి బయటకు తీసుకురావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బాధ్యతను సీఎం జగన్ పలువురు మంత్రులకు అప్పగించినట్టు సమాచారం. మొత్తానికి టార్గెట్ టీడీపీ అనే ఆపరేషన్ కోసం సీఎం జగన్ మంత్రులకు డిసెంబర్ 9 అనే డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది.


First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>