HOME »NEWS »POLITICS »cm ys jagan chandrababu naidu same to same speech on ap legislative council ak

ఒకే రకంగా మాట్లాడిన చంద్రబాబు, జగన్... ఆ అంశంలో...

ఒకే రకంగా మాట్లాడిన చంద్రబాబు, జగన్... ఆ అంశంలో...
జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మండలిని వ్యతిరేకించగా... ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న చంద్రబాబు మళ్లీ తాము అధికారంలోకి వస్తే మండలిని పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించారు.

  • Share this:
    ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరు ఏ అంశంలో అయినా పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటారు. అలాంటి ఈ ఇద్దరు నాయకులు ఒకే అంశంపై సేమ్ టు సేమ్ మాట్లాడారు. మండలి అంశంపై చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు... సీఎం జగన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఓకే రకంగా ఉండటం విశేషం. మండలి పునరుద్ధరణపై గతంలో ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు...దీన్ని వ్యతిరేకించారు. మండలి వల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఒకప్పుడు మండలిలో చదువుకునే వాళ్లు ఎక్కువగా ఉండేవారని... కాని ఇప్పుడు శాసనసభలోనే చదువుకునే వాళ్లు ఉన్నారని చంద్రబాబు అన్నారు. మండలి వల్ల ఖర్చు తప్ప ఏమీ ఉండదని... చాలా రాష్ట్రాల్లో మండలి లేదని అన్నారు.

    శాసనమండలికి ఎక్కువగా అధికారులు ఉండవని... ఒక బిల్లును మండలి నాలుగు నెలలు మాత్రమే అడ్డుకోగలుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ వీడియోను అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రదర్శించింది. అయితే మూడు రోజుల క్రితం అసెంబ్లీలో మండలి అంశంపై జరిగిన చర్చలు సీఎం జగన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలోనే ఇప్పుడు మేధావులు చదువుకునే వాళ్లు ఎక్కువగా ఉన్నారని... మండలి వల్ల ఖర్చు ఉంటుందని అన్నారు. ఎక్కువ రాష్ట్రాల్లో మండలి లేదని జగన్ వ్యాఖ్యానించారు. అయితే గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మండలిని వ్యతిరేకించగా... ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న చంద్రబాబు మళ్లీ తాము అధికారంలోకి వస్తే మండలిని పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించడం విశేషం.

    Published by:Kishore Akkaladevi
    First published:January 27, 2020, 13:44 IST

    टॉप स्टोरीज