సోమవారం ఏపీ కేబినెట్ కీలక భేటీ... మండలి రద్దుపై నిర్ణయం ?

సోమవారం జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో మండలి రద్దుపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: January 24, 2020, 4:53 PM IST
సోమవారం ఏపీ కేబినెట్ కీలక భేటీ... మండలి రద్దుపై నిర్ణయం ?
గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సమీక్షించనుంది.
  • Share this:
ఏపీ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది. శాసనమండలి ఉండాలా ? వద్దా ? అనే అంశంపై శాసనసభలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో... సోమవారం జరగబోయే ఏపీ కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనమండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుని... ఆ వెంటనే దీనిపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించినా... శాసనమండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయించడంపై వైసీపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. మండలి చైర్మన్, టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్న వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్... అసలు మండలి అవసరమా ? అనే చర్చకు తెరలేపింది. దీనిపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ ప్రకటించడంతో... ఆ రోజే మండలి రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: January 24, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading