చంద్రబాబు ఇచ్చిన చెక్ బౌన్స్... ఏపీలో మహిళకు షాక్

సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌ఛార్జి టీడీపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి ద్వారా నవంబర్ 26న సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు బాధితులు.

news18-telugu
Updated: April 21, 2019, 11:11 AM IST
చంద్రబాబు ఇచ్చిన చెక్ బౌన్స్... ఏపీలో మహిళకు షాక్
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 21, 2019, 11:11 AM IST
ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే... ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే నిధుల్లేక విలవిలలాడుతున్న ఏపీ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. ఎన్నికల ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జారీ చేసిన చెక్కు బౌన్స్ అయ్యింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కర్నూలు జిల్లా పాణ్యాంకు చెందిన జ్యోతి అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. పాణ్యం నియోజకరవర్గంలోని నాగిరెడ్డి కాలనీకి చెందిన గంగాధర్ రెడ్డి భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆమెకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే జ్యోతికి వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్లు సూచించారు. అప్పులు, చేబదుళ్ల ద్వారా రూ.56వేల తెచ్చుకున్న జ్యోతి భర్త గంగాధర్ రెడ్డి భార్యకు ఆపరేషన్ చేయించారు. సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌ఛార్జి టీడీపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి ద్వారా నవంబర్ 26న సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో రూ.26,290 మంజూరు చేస్తున్నట్లు ఈ ఏడాది మార్చి 15న వారికి సమాచారం వచ్చింది. ఏపీలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల 9వ తేదీన ఏరాసు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. ఆ మరుసటిరోజే ఈ చెక్కును తీసుకొని బ్యాంకుకు వెళ్లాడు గంగాధర్ రెడ్డి. అక్కడ అతనికి బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. బ్యాంకులో చెక్కు సమర్పించగా, ఆ నెల 15న సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో తగినన్ని నిధులు లేవన్నారు అధికారులు. అంతేకాదు లిఖితపూర్వకంగా గంగాధర్ రెడ్డికి జవాబు కూడా రాసిచ్చారు.

ఇప్పటికే ఏపీలో నిధులు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సైతం ఖాళీ చేసి నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఫలితంగా అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వగా.. ఆ పద్దులో సొమ్ము లేకపోవడంతో బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. దీంతో లబ్దిపొందాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...