టీడీపీ మాజీ ఎంపీకి బీజేపీ ఆకర్ష్... ఫాం హౌస్‌లో భేటీ అందుకేనా..?

అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఫాం హౌస్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు.

news18-telugu
Updated: April 9, 2020, 2:53 PM IST
టీడీపీ మాజీ ఎంపీకి బీజేపీ ఆకర్ష్... ఫాం హౌస్‌లో భేటీ అందుకేనా..?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే చర్చ ఇప్పుడు ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఫాం హౌస్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ జేసీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వారిద్దరూ వచ్చారని ఆయన అనుచరులు తెలిపారు. కొద్దిసేపు ఫాం హౌస్‌లో గడిపి ఆ తర్వాత వెళ్లిపోయారని చెప్పారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి గురించి, వ్యవసాయ రంగం గురించి చర్చించినట్టు తెలిపారు.

జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన జేసీ ట్రావెల్స్ మీద ఇటీవల ఏపీలో ఆర్టీఏ దాడులు ముమ్మరంగా జరిగాయి. భారీ ఎత్తున బస్సులను సీజ్ చేశారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో బస్సులను రిజిస్ట్రేషన్ చేయించి ఏపీకి తీసుకొచ్చారని కూడా అధికారులు కేసులు నమోదు చేశారు. పోలీసులను తిట్టారనే ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదయ్యాయి. జేసీ దివాకర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేటాయించిన గనులను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.

జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన సీఎం రమేష్


ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ వర్గం ఎవరూ పోటీ చేయబోరని జేసీ స్పష్టం చేశారు. జగన్ తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో మార్పులతో పోటీ చేసినా జైలుకు వెళ్లడం ఖాయమనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎన్నికల బరిలో దిగారు.

జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన సీఎం రమేష్


నిర్మొహమాటంగా మాట్లాడే నాయకుడిగా పేరున్న జేసీ దివాకర్ రెడ్డి... తన మీద ఎన్ని కేసులు పెట్టినా ‘జగన్ మావాడే’ అంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. గతంలో కొన్నిసార్లు జేసీ దివాకర్ రెడ్డి పార్టీ మారతారంటూ వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీలో ఉంటే, జగన్ తమను మరింత టార్గెట్ చేయవచ్చని భావించిన కొందరు నేతలు కమలం గూటికి చేరారని, అలాగే, జేసీ కూడా అదే బాటలో నడుస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా సీఎం రమేష్ జేసీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 9, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading