పవర్ స్టార్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డ్యాన్స్

రిత్విక్ ... పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం జరిగింది. వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

news18-telugu
Updated: November 25, 2019, 9:29 AM IST
పవర్ స్టార్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డ్యాన్స్
సీఎం రమేష్ డ్యాన్స్
  • Share this:
ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం అంగరంగా వైభవంగా జరిగింది. దుబాయ్‌లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు సీఎం రమేష్. రాజకీయ ప్రముఖులందర్నీ ఆయన ఆహ్వానించారు. రిత్విక్ ... పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం జరిగింది. వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దుబాయ్ నెల రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో నిశ్చితార్థం ఎంతో గ్రాండ్‌గా చేశారు. సీఎం రమేష్ పార్లమెంట్ లోని ఎంపీలతో పాటుగా అతిరధ మహారధులను ఆహ్వానించారు. వివాహానికి ఏ మాత్రం తీసిపోకుండా నిశ్చితార్ధం నిర్వహించారు.

కొడుకు నిశ్చితార్థంలో ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆ సమయంలో సీఎం రమేష్ జోష్ గా కనిపించారు. పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాటలకు ఆయన స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్ అయ్యింది. అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారు బొమ్మ పాటకు రమేష్ సతీమణితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. దీంతో..ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు