కేరళలో అల్లర్లకు వాళ్లే కారణం: సీఎం విజయన్

కేరళ సీఎం పినరయి విజయన్(File)

కేరళ గొడవల వెనుక ఆర్ఎస్ఎస్ , బీజేపీ ఉన్నాయన్నారు సీఎం విజయన్. వారే దగ్గరుండి మరీ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

 • Share this:
  కేరళలోని పరిస్థితులపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేరళ అల్లర్లు రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. కేరళ గొడవల వెనుక ఆర్ఎస్ఎస్ , బీజేపీ ఉన్నాయన్నారు. వారే దగ్గరుండా మరీ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. వారి వల్లే శబరిమల రణరంగంగా మారిందన్నారు సీఎం విజయన్.

  కేరళలో ప్రజలు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా లేరన్నారు. ప్రభుత్వంతో ఘర్షణకు దిగడం సరికాదని సూచించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. శబరిమలకు వచ్చే మహిళా భక్తుల్ని అడ్డుకోవడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మేం అమలు చేశామని చెప్పుకొచ్చారు.

  బుధువారం తెల్లవారుజామున 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప సన్నిధిలో పూజలు నిర్వహించారు. దీంతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శబరిమల కర్మ సమితి పిలుపుతో కేరళలో బంద్ కొనసాగుతోంది. హిందూసంఘాలన్నీ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బంద్ హింసాత్మకంగా మారడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

  Ayyappa swamys protest against women's entry and supreme court's verdict on sabarimala
  కేరళలో ఆందోళనలు


  కేరళ ప్రభుత్వ తీరుపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పలు చోట్ల సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై స్పందించిన సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తంచేశారు. కేరళను వార్‌జోన్‌గా మారుస్తున్నారని..బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేరళలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు వాళ్లే కారణమని ఆరోపిస్తున్నారు.
  First published: