డబ్బులు పంచే బీజేపీ నేతలను పట్టుకున్నోళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. బెంగాల్ పౌరులకు మమతా బెనర్జీ బంపరాఫర్

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

‘బీజేపీ నేతలు డబ్బులు పంచడానికి రెడీగా ఉన్నారన్న సమచారం నాకు ఉంది. బీజేపీ నేతలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేసవిని మించిన వేడి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కనిపిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇస్తానంటూనే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తీసుకొస్తున్నారంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు గుప్పించారు.

    ‘డబ్బులు పంచి ఓట్లను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సమాచారం నాకు ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రజలారా? వాళ్ల ట్రాప్ లో పడొద్దు. డబ్బులు పంచే బీజేపీ నేతలను నిలదీయండి. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి. డబ్బులు పంచే బీజేపీ లీడర్లను పట్టుకున్న బెంగాల్ పౌరులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా. రాబోయే ఎన్నికల్లో గెలవగానే వారికి ఈ హామీని నెరవేరుస్తా‘ అంటూ బంకురా జిల్లాలోని బిషాన్ పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ ప్రకటించారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

    ‘నేను ప్రధానమంత్రి పదవికి, ఆ కుర్చీకి అత్యంత గౌరవం ఇస్తాను. కానీ నా జీవితంలో మోదీ లాంటి అబద్దాల కోరు అయిన ప్రధానమంత్రిని నేను చూడలేదు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే. పశ్చిమ బెంగాల్ సంస్కృతిని నాశనం చేయడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తరలిస్తున్నారు. బీజేపీ పెడుతున్న టార్చర్ ను భరించలేక ఉత్తర ప్రదేశ్ లోని ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని బీజేపీ సర్కారు పశ్చిమ బెంగాల్ కు ఏదో చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరు‘ అని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..
    Published by:Hasaan Kandula
    First published: