తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోతల రాయుడని, కోతలు కోస్తారని ఎద్దేవా చేశారు. లోపల జరిగేది ఒకటి. బయట చెప్పేది ఒకటన్నారు. కేంద్రం పెద్దలతో కేసీఆర లోపల ఏం మాట్లాడారో రాతపూర్వకంగా ఇస్తేనే ప్రజలు ఆయన్ను నమ్ముతారన్నారు. కేంద్రాన్ని బద్ నాం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఒక్కరే వెళ్లి కలిశారన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా పక్కన, ఎవరో ఒకర్ని తీసుకుని వెళతారని, కానీ, ఈ సారి ఒక్కరే వెళ్లారని, ఆ రహస్యం ఏంటో చెప్పాలన్నారు. ‘కేసీఆర్ వంగి వంగి పొర్లు దండాలు పెట్టినా క్షమించం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం.కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం' అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం
ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..
Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడుగుతున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. మూడో టీఎంసీకి డీపీఆర్ ఇవ్వకపోతే అనుమతి ఇవ్వడం కష్టమని కేంద్ర జలశక్తి శాఖ చెప్పిందని బండి సంజయ్ వెల్లడించారు. కేంద్రం ఒక డీపీఆర్‌కు అనుమతి ఇస్తే, దాన్ని మార్చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే డీపీఆర్ సమర్పించడం లేదన్నారు.
TATA Cars offers: డిసెంబర్లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు
ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి
కరోనా కేసులు లేని ఏకైక పర్యాటక ప్రదేశం.. హనీమూన్ కోసం బెస్ట్ ప్లేస్
ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురిని కలిశారు. మొదట కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల గురించి చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేయాలని కోరారు. తర్వాత రోజు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో భేటీ అయ్యారు. తెలంగాణలో ఆరు చోట్ల దేశీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2018లోనే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక అందజేశామని.. త్వరితగతిన అనుమతులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.
విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం
ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..
Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు
ఇక ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ ప్రాజెక్టులపైనా ప్రధాని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం సహకారం అందించాలని తెలంగాణ సీఎం కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జీఎస్టీ బకాయి నిధులను విడుదల చేయాలని, హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం తక్షణం నిధులు మంజూరు చేయాలని కోరారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 14, 2020, 20:03 IST