ఆర్టీసీ సమ్మె… తొలిసారి క్లారిటీ ఇవ్వనున్న కేసీఆర్ ?

ఆర్టీసీ సమ్మె తరువాత తొలిసారి మీడియా ముందుకు రాబోతున్న కేసీఆర్... ఈ అంశంపై ఏ మాట్లాడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: October 24, 2019, 12:19 PM IST
ఆర్టీసీ సమ్మె… తొలిసారి క్లారిటీ ఇవ్వనున్న కేసీఆర్ ?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అంతరంగం ఏమిటన్న అంశంపై ఎవరికీ పెద్దగా స్పష్టత లేదు. సమ్మె మొదలైన తరువాత అధికారులతో అనేకసార్లు సమీక్షలు జరిపిన సీఎం కేసీఆర్... సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రెండు రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం అధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ నేరుగా మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ఆర్టీసీ సమ్మె తరువాత తొలిసారి మీడియా ముందుకు రాబోతున్న కేసీఆర్... ఈ అంశంపై ఏ మాట్లాడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడం ఖాయం కావడంతో... సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్‌ గెలుపుపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే అంశం కంటే... ఆర్టీసీ సమ్మెపై ఆయన ఏం మాట్లాడతారనే అంశంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సమ్మె విరమించాలని కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కోరతారా ? లేక సమ్మెపై ప్రభుత్వం కఠినంగానే ఉంటుందనే సంకేతాలు ఇస్తారా ? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో... ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆర్టీసీ సమ్మె తరువాత తొలిసారిగా మీడియా ముందుకు రాబోతున్న కేసీఆర్... ఈ అంశంలో ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>