ఆర్టీసీ సమ్మెపై మాట్లాడనున్న కేసీఆర్..? అందరిలోనూ ఉత్కంఠ

హుజూర్ నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారనే అంశం మొత్తం తెలంగాణ వాసుల్లో ఉత్కంఠతో రేపుతోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెనే ఇందుకు కారణం.

news18-telugu
Updated: October 16, 2019, 3:53 PM IST
ఆర్టీసీ సమ్మెపై మాట్లాడనున్న కేసీఆర్..? అందరిలోనూ ఉత్కంఠ
సీఎం కేసీఆర్ (File)
news18-telugu
Updated: October 16, 2019, 3:53 PM IST
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సమీక్షలు, పత్రికా ప్రకటనలు మినహాయిస్తే... ఈ అంశంపై సీఎం కేసీఆర్ నేరుగా కామెంట్ చేసిన సందర్భాలు లేవు. సమ్మెపై ప్రభుత్వం వైఖరిని అధికారులకు వివరిస్తున్న సీఎం కేసీఆర్... తొలిసారి ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే హుజూర్ నగర్ ఇందుకు వేదిక కానుందని సమాచారం. ఎల్లుండి హుజూర్ నగర్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఓటు వేయాలని హుజూర్ నగర్ ప్రజలను కోరనున్నారు.

అయితే హుజూర్ నగర్‌లో కేసీఆర్ ఏం మాట్లాడతారనే అంశంపై అక్కడి ప్రజలతో పాటు మొత్తం తెలంగాణ వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టువీడకపోవడంతో... ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో అసలు ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ? ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు హుజూర్ నగర్ వేదికగా తన వాదన వినిపిస్తారా ? అన్నది ఆసక్తి రేపుతోంది.

హుజూర్ నగర్‌లో సీఎం కేసీఆర్ కేవలం నియోజకవర్గ సమస్యలకు మాత్రమే పరిమితమయ్యేలా మాట్లాడితే... అది టీఆర్ఎస్‌కు ఏ మాత్రం లాభించదనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే తీవ్ర ప్రతికూలతలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టగా పేరున్న కేసీఆర్... హుజూర్ నగర్ వేదికగా ఏం చేస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...