నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఇవాంకా కోసం ప్రత్యేక బహుమతి..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.

news18-telugu
Updated: February 25, 2020, 6:34 AM IST
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఇవాంకా కోసం ప్రత్యేక బహుమతి..
సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విందులో మొత్తంగా 90 నుంచి 95 వీఐపీలు మాత్రమే పాల్గొననున్నట్టు సమాచారం. వీరిలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక, అసోం, హరియాణా, బిహార్‌ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. కాగా, ట్రంప్‌తో పాటు మెలానియా, ఇవాంకకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు.
ఇవాంకా

మెలానియా, ఇవాంకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను సీఎం బహూకరించనున్నారు. రేపు హైదరాబాద్‌కు సీఎం తిరిగి వస్తారు. కాగా, విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. అటు.. ఇవాంక హైదరాబాద్‌ను గుర్తు చేసుకోవడం విశేషం. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె.. హైదరాబాద్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా గోల్కొండ కోటలో కలియదిరిగారు.

First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు