కేసీఆర్‌కు ఈసారైనా ఛాన్స్ ఇస్తారా ?

కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆయనకు ఆ ఛాన్స్ రాలేదు.

news18-telugu
Updated: December 13, 2019, 1:05 PM IST
కేసీఆర్‌కు ఈసారైనా ఛాన్స్ ఇస్తారా ?
కేసీఆర్, మోదీ
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రావడం లేదని... రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు తనకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనే భావనలోనూ సీఎం కేసీఆర్ ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్... రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆయనకు ఆ ఛాన్స్ రాలేదు. దీంతో షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు సీఎం కేసీఆర్.

తాజాగా బకాయిలు, కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల తదితర అంశాలపై ప్రధానితో చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 14న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజున మోదీ అపాయింట్‌మెంట్‌ కోరుతూ పీఎంవోకు సీఎంవో లేఖ రాసింది. అపాయింట్‌మెంట్‌ ఖరారైతే శనివారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. అయితే ఈసారైనా కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్’మెంట్ లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సారి ప్రధానిని కలిసే అవకాశం రాకపోతే... కేంద్రంపై మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.


First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>