సభలో కేసీఆర్, భట్టీ మధ్య మాటల యుద్ధం

ప్రాజెక్టుల విషయంలో కూడా ఇరువురి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. ప్రాజెక్టులు పూర్తవుతుంటే... ప్రతిపక్షం కళ్లు ఉన్న కబోదుల్లా మారారన్నారు.

news18-telugu
Updated: September 14, 2019, 1:55 PM IST
సభలో కేసీఆర్, భట్టీ మధ్య మాటల యుద్ధం
భట్టి విక్రమార్క్, సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా... సీఎం కేసీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య మాటల దాడి కొనసాగింది. దివాళా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా లేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉందని గుర్తు చేశారు. దీంతో భట్టీ వ్యాఖ్యలని తప్పు పట్టారు సీఎం కేసీఆర్. భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చూసి అక్కసుతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు ముఖ్యమంత్రి. దీంతో కల్పించుకున్న భట్టి నేను అసత్యాలు మాట్లాడటం లేదన్నారు. తాను చెప్పినవన్నీ వాస్తవాలే అన్నారు భట్టీ. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు.

ప్రాజెక్టుల విషయంలో కూడా ఇరువురి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడిచింది. ప్రాజెక్టులు పూర్తవుతుంటే... ప్రతిపక్షం కళ్లు ఉన్న కబోదుల్లా మారారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు కేసీఆర్. భక్త రామదాసు ప్రాజెక్టు కనిపించడం లేదా ? అంటూ మండిపడ్డారు. ఐదేళ్లుగా ప్రతిపక్షం ఒకే పాట పాడుతుందన్నారు కేసీఆర్. బ్రాహ్మాండమైన మెజార్టీతో గెలిస్తే... ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారని గుర్తు చేశారు గులాబీ బాస్. మూడు లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పు ఉందని నిరూపిస్తారా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ చేశారు కేసీఆర్. నేను ఉద్యమ నాయకుడ్ని అన్న కేసీఆర్... ఏ ప్రాజెక్టు ఎందుకో తనకు తెలుసన్నారు. నాకు తెలియని ప్రాజెక్టులో తెలంగాణలో ఎక్కడున్నాయన్నారు ముఖ్యమంత్రి.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>