• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • CM KCR TREATED EETALA RAJENDER AS SECOND CM TRS MLC BASAVARAJU SARAIAH INTERESTING COMMENTS ON EETALA ISSUE SK

Eetala Rajender: ఈటలను రెండో సీఎంగా చూశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి ఈటల రాజేందర్ (ఫైల్)

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రి ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలెను తెలంగాణ రెండో సీఎంగా.. సొంత తమ్ముడి సీఎం కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసమే తల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు.

  • Share this:
    తెలంగాణలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించడం, బీజేపీ పెద్దలను ఈటల కలవడం, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో మాజీ మంత్రిని టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈటలపై ఎదురుదాడికి దిగుతున్నారు. హుజురాబాద్‌లో పట్టు కోల్పోకుండా.. నేతలు, కార్యకర్తలు చేజారకుండా జాగ్రత్తపడుతున్నారు.తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాజీ మంత్రి ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలెను తెలంగాణ రెండో సీఎంగా.. సొంత తమ్ముడి సీఎం కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసమే తల్లి లాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు.


    హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో బసవరాజు సారయ్య సమావేశమయ్యారు. అందరూ టీఆర్ఎస్ వెంటనే ఉండాలని ప్రమాణం చేయించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఆయన్ను రెండో సీఎంగా, సొంత తమ్ముడిలా కేసీఆర్ చూసుకున్నారని అన్నారు. తండ్రిలాంటి వాడిని ధిక్కరించి.. కష్టపడి గెలిపించిన తమల్ని కాదని.. ఈటల వెళ్లిపోయాడని విమర్శించారు. ఈటలను ఎవరూ బయటకు పంపలేదని.. తనకు తానుగానే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయని.. అలాంటి పార్టీలోకి ఈటల వెళ్లడం దారుణమని మండిపడ్డారు సారయ్య.

    కాగా, శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ గుడ్‌బై చెప్పారు. గులాబీ దళంతో 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమ కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వీరంతా బీజేపీలో చేరనున్నారు. తాను బీజేపీలోకి వెళ్లిన తర్వాత...మరికొందరు ఉద్యమకారులు పార్టీలోకి వస్తారని ఈటల రాజేందర్ అన్నారు.

    టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే.. తాను బతకలేనని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలను హుజురాబాద్ ప్రజలు బొంద పెడతారని అన్నారు. హరీష్ రావు, వినోద్ రావు వచ్చినా ఏం చేయలేరని తెగేసి చెప్పారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని.. ఆత్మగౌరవం కోసం కొట్లాడేవారని ఆయన స్పష్టం చేశారు.

    ఈటల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈటలను ప్రగతిభవన్‌లోకి రానీయకుంటే.. అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఆస్తులను కాపాడుకునేందుకే.. ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారని మండిపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published: