నేడు తెలంగాణ కేబినెట్ భేటీ... కేంద్రమే టార్గెట్

తెలంగాణ కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

news18-telugu
Updated: December 11, 2019, 8:40 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ... కేంద్రమే టార్గెట్
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు సహా పలు అంశాలు చర్చకు రానున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆశించిన స్థాయిలో రావడం లేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సీఎం కేసీఆర్. దీనిపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి ? రావాల్సిన నిధులు ఎన్ని ? అనే అంశంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం... శాఖలవారీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి వివరాలను ప్రజల ముందుంచాలని భావిస్తోంది.

కేబినెట్ సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తెలంగాణ అటవీ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది.


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>