Home /News /politics /

CM KCR Maha Dharna: నేడు కేసీఆర్ మహా ధర్నా.. సీఎం అయ్యాక ఇదే తొలిసారి

CM KCR Maha Dharna: నేడు కేసీఆర్ మహా ధర్నా.. సీఎం అయ్యాక ఇదే తొలిసారి

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR Maha Dharna: సీఎం అయ్యాక తొలిసారి మహా ధర్నాలో పాల్గొనబోతున్నారు కేసీఆర్. మహా ధర్నా కార్యక్రమం తర్వాత.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి వినతీ పత్రం సమర్పిస్తారు.

  తెలంగాణ (Telangana) సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు మహా ధర్నా (CM KCR Maha Dharna)లో పాల్గొననున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు (Paddy Procurement) చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ టీఆర్ఎస్ మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ధర్నాలో కూర్చుంటారు. ఉదయం 11 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, డీసీఎంఎస్‌ల చైర్మన్లు ధర్నాలో పాల్గొంటారు. అనంతరం గవర్నర్‌కు మెమొరాండంను అందజేస్తారు. మహా ధర్నా ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

  Dharni portal : ధరణి పోర్టల్‌లో మరిన్ని మాడ్యూల్... అవగాహన లేకపోవడం వల్లే సమస్యలు..

  వరి ధాన్యం సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై FCIకి ఆదేశాలివ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. అలాగే ఖరీఫ్‌లో ఎంత ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వాలని డిామండ్ చేశారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని లేఖలో కోరారు సీఎం కేసీఆర్. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం మాత్రం పెర‌గ‌ట్లేదని లేఖలో ప్రస్తావించారు.

  Nizamabad mlc : ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇక లేనట్టేనా... ? ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన వ్యూహం ఏంటి?

  తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఎన్నో ఆందోళనలు చేపట్టింది. ఎన్నో కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. దీక్షలు, ధర్నాలు చేశారు. 2014లో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా.. టీఆర్ఎస్ ప్రభుత్వం భారత్ బంద్ సహా పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది. కానీ సీఎం కేసీఆర్ నేరుగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. కానీ తొలిసారి మహా ధర్నాలో పాల్గొనబోతున్నారు సీఎం కేసీఆర్. మహా ధర్నా కార్యక్రమం తర్వాత.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి వినతీ పత్రం సమర్పిస్తారు. ఇప్పటికే రెండు సార్లు ప్రెస్‌మీట్స్ నిర్వహించి కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. ధర్నా ఆయన మళ్లీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.

  Karimnagar: మాజీ సహచరులకు హ్యాండ్ ఇచ్చిన KCR.. వారి పరిస్థితేంటి ?

  మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ ఆందోళన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ కొని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు రైతులతో ప్రదర్శన నిర్వహించనుంది. ఇప్పుడే కదిలిరా పేరుతో కార్యక్రమాలను తలపెట్టింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగుతుంది. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ.. రైతులకు నష్టం కలిగిస్తున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు. వరి ధాన్యాంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీ అనంతరం అధికారులకు మెమోరాండం సమర్పిస్తారు హస్తం నేతలు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

  తదుపరి వార్తలు