అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్న విజయశాంతి

Vijayashanti on akbaruddin comments | కరీంనగర్‌ సభలో హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విజయశాంతి ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు.

news18-telugu
Updated: July 26, 2019, 7:10 PM IST
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలన్న విజయశాంతి
విజయశాంతి ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ వ్యాఖ్యాలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందు, ముస్లింల సంఖ్య సమానం చేస్తామనటం, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటన రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఆ ఉద్దేశ్యం కనపడుతూ ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ప్రశాంత పరిస్థితులను కాపాడవలసిన బాధ్యత దృష్ట్యా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై తక్షణమే స్పందించవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

కరీంనగర్‌ సభలో హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విజయశాంతి ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయనపై పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి.అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన రాములమ్మ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>